ఓపక్క టెన్నిస్‌ శిక్షణ... మరోపక్క దొంగతనాలు.. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ!

16-05-2019 Thu 10:04 | Both States
  • చిన్నప్పటి నుంచీ చోరీలు 
  • జైలుకి వెళ్లి వచ్చినా మారని తీరు
  • రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి కొనసాగింపు
బాల్యంలోనే చోరీకి పాల్పడి జువైనల్‌ హోంలో ఉన్నాడు. బయటకు వచ్చాకైనా బుద్ధి మార్చుకోలేదు. చోరీలనే కేరాఫ్‌గా మార్చుకున్నాడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అదే తీరు. మధ్యలో చిన్న చేంజ్‌. టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి శిక్షకుడి అవతారం ఎత్తాడు. పగలు కోచింగ్‌, వీలు చిక్కితే దొంగతనాలు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు.

మాదాపూర్‌ జోన్‌ డీసీపీ, కూకట్‌ పల్లి ఏసీపీ తెలియజేసిన వివరాలు ఇవీ. రాజమండ్రి వై.జంక్షన్‌కు చెందిన కోమలి రామకృష్ణ (24) అలియాస్‌ బాబీ ఇంటర్‌ పూర్తి చేశాడు. అమ్మమ్మే ఇతన్ని పెంచి పెద్దచేసింది. 2012లో రాజమండ్రిలో ఓ చోరీ చేయడంతో పోలీసులు జువైనల్‌ హోంకు పంపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి మూడో టౌన్‌, ధవళేశ్వరం, రాజానగరం ఠాణా పరిధుల్లో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు.

2017లో హైదరాబాద్‌ చేరుకుని తొలుత నిజాంపేట ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ కూరగాయలు అమ్మి జీవనోపాధి పొందేవాడు. 2018లో ఓ అపార్ట్‌మెంట్లో గృహోపకరణాలు దొంగిలించడంతో తన పాత జీవితాన్ని ప్రారంభించాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చోరీలనే ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నాడు. కాకపోతే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఓ టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. ఓ వైపు శిక్షణ ఇస్తూ పరిచయం ఉన్న వారి ఇళ్లలో చోరీకు పాల్పడేవాడు.

రామకృష్ణ పనిచేసే కోచింగ్‌ సెంటర్‌లో ఓ వైద్యుని కుమారుడు శిక్షణ పొందేవాడు. ఆ బాలుడిని శిక్షణ పూర్తయ్యాక ఇంట్లో దింపి వెళ్లేవాడు. ఈ విధంగా ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. తాము ఊరెళ్తున్నామని బాలుడు చెప్పడంతో రామకృష్ణ వైద్యుని ఇంటిపై కన్నేశాడు. వారు గత నెల 25న తీర్థయాత్రకు వెళ్లగా, 27న ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

వైద్యుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ పాత చరిత్ర, వైద్యుని ఇంటికి బాలుడిని డ్రాప్‌ చేస్తున్న విషయాలు తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. బాలుడి వద్ద నుంచి ఇంటి తాళం చెవి ఒకటి కొట్టేసి చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు.  అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Crime NewsrajamundryHyderabadtheafts

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more